: మొత్తానికి అలియా భట్ తన 'ప్రేమ' వ్యవహారాన్ని ఒప్పేసుకుంది
బాలీవుడ్ యువనటి అలియా భట్ ఎట్టకేలకు ఒప్పుకుంది. కరణ్ జోహర్ నిర్మించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' తో బాలీవుడ్ కి అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయంలోనే అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో పడిందని వార్తలు వెలువడ్డాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని అలియా భట్ పలు సందర్భాల్లో చెప్పింది. తాజాగా వీరిద్దరూ కలిసి 'కపూర్ అండ్ సన్స్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తోందంటూ బాలీవుడ్ లో కథనాలు వెలువడ్డాయి. కపూర్ అండ్ సన్స్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న అలియా భట్ వీటిపై స్పందిస్తూ...అవును లవ్ లో ఉన్నానని చెప్పింది. తన కుడివైపు ఉన్న వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అందులో ఎలాంటి ఒత్తిడి లేదని, అతనితో నటించడం అద్భుతమైన అనుభూతి అని తెలిపింది. ఆ సమయంలో ఆమె కుడివైపున సిద్ధార్థ్ మల్హోత్రా, ఎడమవైపు ఫవాద్ ఖాన్ కూర్చుని ఉన్నారు. దీనిపై బాలీవుడ్ నటుడు ...కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అలియా, సిద్ధార్థ్ జోడీ చూసేందుకు అంత గొప్పగా ఉండదని... సిద్ధార్థ్ పక్కన అలియా బాగా చిన్నగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. దీనిపై సిద్ధార్థ్ మల్హోత్రా తీవ్రంగా స్పందించాడు.