: ఇండియా వచ్చి కూడా శ్రీశ్రీ రవిశంకర్ కు హ్యాండిచ్చిన రాబర్ట్ ముగాబే!


ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే, కార్యక్రమానికి హాజరు కాకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక వెబ్ సైట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియాకు వచ్చిన తరువాత ప్రొటోకాల్ ఎంత మాత్రమూ సంతృప్తికరంగా లేదని, భద్రత విషయమై తగు ఏర్పాట్లు లేవని ఆరోపిస్తూ, తిరిగి స్వదేశం చేరుకోవాలని ఆయన భావిస్తున్నట్టు వెల్లడించింది. ఇండియాలోని నేతలే కార్యక్రమానికి రావడం లేదని గుర్తు చేసింది. కాగా, ఈ కార్యక్రమం పర్యావరణానికి హాని కలిగిస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరు కారాదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కాగా, ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం, ప్రధాని మోదీ మాత్రం హాజరవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News