: 'నావిగేషన్' వ్యవస్థ కొత్తపుంతలు, పీఎస్ఎల్వీ సీ-32 సక్సెస్


నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-32, ఈ సాయంత్రం 4:20 గంటల సమయంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ - 1 ఎఫ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాహనాల గమ్యాన్ని నిర్దేశిస్తూ, విపత్తు సమయంలో బాధితులకు, భద్రతా బలగాలకు సేవలు అందించడమే లక్ష్యంగా ఇస్రో తయారు చేసిన ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలు అందించనున్నదని భారతఅంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఏ ఎస్‌ కిరణ్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రయోగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్ లో ఆరవ ఉపగ్రహమని తెలిపారు. దీన్ని విజయవంతం చేసేందుకు అహర్నిశలూ శ్రమించిన శాస్త్రవేత్తల బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కాగానే షార్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు చప్పట్లు కొడుతూ, కరచాలనం చేస్తూ ఒకరిని ఒకరు అభినందించుకుని మిఠాయిలు పంచుకున్నారు.

  • Loading...

More Telugu News