: బీసీలు, కాపులకు కేటాయింపులు సరిగ్గా లేవు: వైఎస్ జగన్


ఏపీ ఆర్థిక బడ్జెట్ 2016-17లో బీసీలు, కాపులకు కేటాయింపులు సరిగా లేవని, టీడీపీ సర్కారు గతంలో చెప్పిన దానికి... ఇప్పుడు కేటాయించిన దానికి ఎక్కడా పొంతన లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక అభూత కల్పన అని అన్నారు. బడ్జెట్ లో వ్యవసాయ కేటాయింపులు దారుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఒకేలా ఉన్నాయన్నారు. రుణమాఫీకి కేటాయించిన నిధులు వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోవని జగన్ అన్నారు.

  • Loading...

More Telugu News