: నింగిలోకి దూసుకుపోయిన పీఎస్ఎల్వీ-సీ 32!


భారత నావిగేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చే దిశగా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ 32 సరిగ్గా 4 గంటలకు నింగిలోకి ఎగసింది. పీఎస్ఎల్వీ సిరీస్ లో ఇది 52వ ప్రయోగం కాగా, దీని ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1 ఎఫ్‌ ఉపగ్రహం మరికాసేపట్లో కక్ష్యలోకి చేరనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఉపగ్రహం బరువు 1,425 కేజీలు కాగా, రాకెట్ నింగికెగసిన 108వ సెకనులో తొలిదశ విజయవంతమైనట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారతఅంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధినేత ఏ.ఎస్‌. కిరణ్‌కుమార్‌ స్వయంగా ప్రయోగాన్ని వీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News