: ఆ పాట చూసి రీఫ్రెష్ అయ్యాను: షారూక్ ఖాన్


దర్శకుడు షకున్ బత్రా దర్శకత్వంలోని కపూర్ అండ్ సన్స్ చిత్రంలోని ‘లెట్స్ నాఛో’ పాటను చూసి తాను రీఫ్రెష్ అయ్యానని బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ అన్నాడు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశాడు. నిన్న విడుదలైన ‘లెట్స్ నాఛో’ పాటను చూసినట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కపూర్ అండ్ సన్స్ చిత్ర బృందానికి కంగ్రాట్స్ చెప్పాడు. ‘లెట్స్ నాఛో’ పాటకు సంబంధించిన ఒక స్టిల్ ను కూడా షారూక్ పోస్ట్ చేశాడు. కాగా, బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియాభట్, ఫవాద్ ఖాన్ కీలక పాత్రల్లో ఈ చిత్రంలో నటించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కానుంది.

  • Loading...

More Telugu News