: ఏపీకి కేంద్రం మట్టి, నీరునే ఇచ్చింది... వాటినే కేంద్రానికి తిరిగి ఇస్తున్నాం: కేవీపీ కామెంట్స్


రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఏపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న మట్టి సత్యాగ్రహంపై కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. నవ్యాంద్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రాష్ట్రానికి మట్టి, నీటిని మాత్రమే ఇచ్చి వచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చిన వాటిని మోదీ సర్కారుకు తిరిగి ఇచ్చేందుకే మట్టి సత్యాగ్రహం నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏపీలో సేకరించిన మట్టి, నీటిని కేంద్రానికి అందించేందుకే ఆందోళనను చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న ఆందోళనలో తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు కూడా పాల్గొననున్నారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News