: తప్పుడు కేసు పెట్టారన్న సల్మాన్ ఖాన్... విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసిన కోర్టు
రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొద్దిసేపటి క్రితం జోధ్ పూర్ కోర్టులో జరిగిన విచారణకు హాజరయ్యాడు. గతంలో సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లిన సల్మాన్ ఖాన్ సహ నటులతో కలిసి కృష్ణ జింకలను వేటాడాడు. తుపాకీ చేతబట్టి జీపులో వెళ్లిన అతడు ఓ జింకను కాల్చడమే కాకుండా దానిని అతడు స్వయంగా ముక్కలుగా కోశాడని ఆరోపణలు నమోదయ్యాయి. కృష్ణ జింకలను ఆరాధించే బిష్ణోయ్ జాతి సల్మాన్ చర్యపై మండిపడింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే నేటి విచారణలో భాగంగా... ఈ విషయంలో తనపై తప్పుడు అభియోగాలు నమోదు చేశారని సల్మాన్ కోర్టుకు చెప్పాడు. అతడి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు కేసు తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది.