: పుట్టిన రోజు పార్టీకి పిలిచి...సామూహిక అత్యాచారానికి పాల్పడి... చివరికి ఆమెను అమ్మేశారు!


స్నేహితురాలిని పుట్టిన రోజు పార్టీకి పిలిచి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను వ్యభిచార గృహానికి అమ్మేసిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...నలంద జిల్లాకు చెందిన ఓ యువతిని పుట్టిన రోజు పార్టీకి స్నేహితులు ఆహ్వానించారు. స్నేహితులే కదా అన్న భరోసాతో ఆమె ఆ పుట్టిన రోజు వేడుకలకు హాజరైంది. అక్కడ ఆమెపై ఆ నలుగురూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను ఓ వ్యభిచార గృహానికి అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను రక్షించి, వ్యభిచార గృహం నడుపుతున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న అత్యాచార నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News