: మరో రెండు బడ్జెట్ లే, ఆపై టీఆర్ఎస్ మాయం: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు బడ్జెట్ లను మాత్రమే టీఆర్ఎస్ ప్రవేశపెడుతుందని, ఆపై ఆ పార్టీ మాయమవుతుందని తెలుగుదేశం పార్టీ నేత, తెలంగాణ టీడీపీ శాసనసభా నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గడచిన రెండేళ్లలో అభూత కల్పనలతో కూడిన బడ్జెట్ ప్రతిపాదనలను టీఆర్ఎస్ సభ ముందు ఉంచిందని అన్నారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ, నక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలేవీ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కారును నామరూపాల్లేకుండా చేసే రోజు త్వరలోనే రానుందని అన్నారు. దళితులు, గిరిజనులకు భద్రత కొరవడిందని, ఏ సంక్షేమ పథకమూ సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. రేవంత్ వెంట ఎల్.రమణ, సండ్ర తదితరులు ఉన్నారు.