: కిమ్ జోంగ్ ...బీ కేర్ ఫుల్: రష్యా హెచ్చరిక
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు రష్యా తీవ్రహెచ్చరికలు చేసింది. దూకుడు తగ్గించుకోవాలని ఆయనకు రష్యా సూచించింది. శత్రుదేశాలను ఎదుర్కొనేందుకు అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వెనుకాడం, సర్వసన్నద్ధంగా ఉన్నామంటూ కిమ్ జోంగ్ ఉన్ గుప్పిస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ న్యాయచట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని రష్యా హితవు పలికింది. దీంతో ఉత్తరకొరియాపై సైనికచర్యకు దిగే చట్టపరమైన అవకాశం ఉందని రష్యా తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న వేళ, ఉత్తరకొరియా రెండు ఖండాంతర క్షిపణులను ప్రయోగించి సవాలు విసిరింది. దీంతో జపాన్, రష్యా, చైనా తదితర దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా తాజా ప్రకటన చేయడం గమనార్హం. అయితే రష్యా ప్రకటనను విశ్లేషిస్తే... ఉత్తర కొరియా తన దుందుడుకు చర్యలు కట్టిపెట్టని పక్షంలో ప్రపంచ దేశాలు ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది.