: టెన్షన్ టెన్షన్... తూర్పు తీరంవైపు మిసైళ్లు ప్రయోగించిన కిమ్ జాంగ్ సైన్యం


కొరియా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరింతగా వేడెక్కింది. ఓవైపు దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తుండగా, ఉత్తర కొరియా సైన్యం రెండు ఖండాంతర క్షిపణులను తూర్పు తీరంవైపు ప్రయోగించి ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఈ ఉదయం 5:20 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:50 గంటలు) 500 కి.మీ దూరం వెళ్లగల రెండు మిసైళ్లను ప్రయోగించామని, అవి జపాన్ సముద్రంలో లక్ష్యాలను తాకాయని ఉత్తర కొరియా రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. తామేమీ ఎవరినీ రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ పని చేయలేదని, తరచూ చేసే పరీక్షల్లో భాగంగానే వీటిని వదిలామని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో కింగ్ జాంగ్ ఉన్ సైన్యం ఆరు హై కాలిబర్ రాకెట్లను ప్రయోగించింది. ఆపై అమెరికాను బూడిద చేయగల అణుబాంబులు ఉన్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News