: మరోమారు కోర్టు మెట్లెక్కనున్న సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నేడు మరోమారు కోర్టు మెట్లెక్కనున్నాడు. అదేంటీ ‘హిట్ అండ్ రన్’ కేసు నుంచి అతడికి విముక్తి లభించింది కదా, ఇంకా కోర్టు మెట్లెక్కడమేంటనేగా మీ అనుమానం? ‘హిట్ అండ్ రన్’ తో పాటు రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసులోనూ సల్మాన్ ముద్దాయిగా ఉన్నాడుగా. ఈ కేసులో అతడిపై జోధ్ పూర్ కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ కేసు విచారణ కోసమే సల్మాన్ నేడు మరోమారు జోధ్ పూర్ కోర్టుకు హాజరుకానున్నాడు. ఈ విషయం తెలిసిన అతడి అభిమానులు తమ అభిమాన నటుడిని చూసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు.