: పార్టీ మ్యానిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం...ముద్రగడ ఆ ట్రాప్ లో పడొద్దు: గంటా


తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టో అంటే టీడీపీకి పవిత్ర గ్రంథమని మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని నెరవేరుస్తామని అన్నారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. అలాగే కాపులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని ఆయన అన్నారు. కాపుల పేరుతో సాగుతున్న కుట్రలో ముద్రగడ భాగం కాకూడదని ఆయన పిలుపునిచ్చారు. అలా కుట్రలో పాల్గొని కాపులకు అన్యాయం చేయొద్దని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News