: అధికారులకు తప్ప అందరికీ తెలిసిన మాల్యా 'సీక్రెట్' హోం 'లేడీ వాక్'!


విజయ్ మాల్యా... భారత్ లో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు బకాయిపడి, ఆపై అరెస్ట్ చేస్తారన్న భయంతో లండన్ పారిపోయిన ఒకప్పటి పారిశ్రామిక దిగ్గజం. వాస్తవానికి లండన్ నడిబొడ్డున ఉన్న బార్కర్ వీధిలో మేడమ్ టుస్సాడ్ మ్యూజియానికి రెండు భవంతుల అవతలే విజయ్ మాల్యా ఇల్లుంది. అందరికీ తెలిసిన మాల్యా లండన్ చిరునామా అదే కాగా, దాంతో పాటు ఓ రహస్య కౌంట్రీ హోమ్ కూడా బ్రిటన్ లో ఆయనకుంది. కచ్చితమైన పోస్టల్ అడ్రస్ తెలిస్తేగాని ఆ ఇంటిని పట్టుకోలేనంత రహస్య ప్రదేశమది. కానీ, లండన్ కు దాదాపు 100 కి.మీ దూరంలో హెర్ట్ ఫర్ షైర్ ప్రాంతంలోని తివెన్ గ్రామంలో మాల్యాను గురించి తెలియని వారుండరు. ఇక్కడుండే వారిలో చాలా మందికి ఆయన తెలుసు కూడా. "స్థానిక పబ్బులకు ఆయన తరచుగా వస్తుంటారు. నిన్న కూడా 'ఫోర్స్ ఇండియా' అని రాసున్న నలుపు రంగు ఆడీ కారులో ఆయన్ను కలవడానికి ఓ యువతి వచ్చింది. ఆయన లండన్ వచ్చారంటేనే ఈ ప్రాంతంలో సందడి మొదలవుతుంది. ఎన్నో ఫ్యాన్సీ కార్లు రోడ్ల మీదకు వస్తాయి. మాల్యా ఇక్కడే ఉన్నారనడానికి ఇదే సాక్ష్యం. మా ఊరిలో అతిపెద్ద ఇల్లు ఆయనదే" అని తివెన్ నివాసి ఒకరు వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా పలువురు మాల్యాను కలిసేందుకు ఖరీదైన కార్లలో వస్తున్నారని గ్రామ ప్రజలు వెల్లడించారు. మొత్తం 30 ఎకరాల్లో 'లేడీ వాక్' పేరిట చుట్టూ ఎత్తయిన ప్రహరీ గోడ, సీసీటీవీ కెమెరాల నిఘాలో మాల్యా 'సీక్రెట్' భవంతి ఉందట. ఇక ఈ భవంతికి అతి సమీపంలోని 'వైట్ హార్స్' పబ్ కు ఆయన రెగ్యులర్ కస్టమర్. "ఇటీవలే ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన వెంట పలువురు యువతులు కూడా ఉన్నారు" అని పబ్ ఉద్యోగి తెలిపారు. ఇక మాల్యాకు నోటీసులను లండన్ లోని భారత ఎంబసీ అధికారుల ద్వారా పంపినట్టు తెలిసిన సంగతి తెలిసిందే. ఆయన ఎక్కడున్నాడన్న విషయం మాత్రం అధికారులకు తెలియదట. ఇక వారు అందరికీ తెలిసిన ఈ 'లేడీ వాక్' చిరునామాను కనుక్కొని నోటీసులు ఎప్పటికి ఇస్తారో?!

  • Loading...

More Telugu News