: అవిశ్వాసంపై మీ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి విశ్వాసముంది?: జగన్ కు కాల్వ సూటి ప్రశ్న


కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విపక్ష వైసీపీపై ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అసంతృప్తి ఉంటే నిరసన తెలిపేందుకు చాలా మార్గాలు ఉన్నా, వాటిని ఆశ్రయించకుండా వీగిపోయే అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ నుంచి బయటకు వచ్చిన కాల్వ అక్కడి మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. ‘‘మీరు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మీ పార్టీలోని ఎంతమంది ఎమ్మెల్యేలకు విశ్వాసముంది? అనుకూలంగా ఎంతమంది ఓటేస్తారు?’’ అని ఆయన జగన్ కు సూటి ప్రశ్నలు సంధించారు.

  • Loading...

More Telugu News