: బంగారం వ్యాపారానికి రూ. 60 వేల కోట్ల నష్టం!


ఆభరణాల రంగం నుంచి మరింత పన్నును వసూలు చేసి ఖజానాకు తరలించే ఉద్దేశంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా జ్యూయెలర్స్ చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. మొత్తం 358 సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ 9 రోజుల వ్యవధిలో జ్యూయలర్స్ సెక్టారు రూ. 60 వేల కోట్లను నష్టపోయిందని బులియన్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, రూ. 2 లక్షల కన్నా విలువైన లావాదేవీలపై పాన్ కార్డు నమోదు ప్రతిపాదనను, పెంచిన పన్నులను వెనక్కి తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News