: మోహిత్ కూ పెళ్లైపోయింది!... స్నేహితురాలిని వివాహమాడిన టీమిండియా బౌలర్
టీమిండియాలో పెళ్లి సందడి కొనసాగుతోంది. స్పిన్నర్ హర్భజన్ సింగ్ మొదలెట్టిన ఈ పెళ్లి సందడిని జట్టు సభ్యులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఊతప్ప, ధావల్ కులకర్ణిలు పెళ్లిళ్లు చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టగా, తాజాగా ఆ జాబితాలో జట్టు ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ లో మంగళవారం వైభవంగా జరిగిన వివాహ వేడుకలో మోహిత్... తన చిన్ననాటి స్నేహితురాలు శ్వేతను పెళ్లి చేసుకున్నాడు.