: ఉత్తర కొరియా అధ్యక్షుడి 'తల నరకడమే' వారి లక్ష్యం!


కొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త మిలటరీ విన్యాసాలు సాగుతుండగా, మరోవైపు సూక్ష్మ అణు వార్ హెడ్స్ ను ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచాలని, యుద్ధం చేయాల్సి వస్తే వెనకడుగు వేసేది లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా, అమెరికాలు సంయుక్తంగా 'కీ రిసాల్వ్ - పోల్ ఈగల్' పేరిట మిలటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తూ, 'బీ హెడింగ్ మిషన్' (తల నరకడమే లక్ష్యం) లక్ష్యంగా సాగుతున్నారని, కిమ్ తల మాత్రమే వారి లక్ష్యమని దక్షిణ కొరియా మీడియాలో వార్తలు రావడం సంచలనం కలిగించింది. మరో రెండు నెలల పాటు విన్యాసాలు సాగనుండగా, తమపై ఎలాంటి దాడి జరిగినా అమెరికా నాశనానికి ముహూర్తం ప్రారంభమైనట్టేనని కిమ్ హెచ్చరించారు. శత్రువును చావుదెబ్బ కొట్టే శక్తి తమకుందని అన్నారు.

  • Loading...

More Telugu News