: ఇటువైపు ఒక్క జగన్... అటువైపు సీఎం సహా 16 మంది!
గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుగుతున్న వేళ, ప్రతిపక్ష వైకాపా నుంచి ఒకేఒక్కడిగా జగన్ ప్రసంగిస్తూ, చంద్రబాబు సర్కారును విమర్శిస్తున్న వేళ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ను పలుమార్లు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 12:20 గంటల నుంచి జగన్ ప్రసంగం ప్రారంభం కాగా, ఆయన సుదీర్ఘ ప్రసంగం సాయంత్రం 4:20 గంటల వరకూ సాగింది. ఈ మధ్యలో ఆయన ఆరోపణలు చేసినప్పుడల్లా సంబంధిత మంత్రి లేదా ఎమ్మెల్యే మైక్ తీసుకుని ప్రత్యారోపణలు చేశారు. జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్న వారిలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల, గంటా తదితరులతో పాటు పలువురు ఎమ్మెల్యేలూ ఉన్నారు. చర్చ అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపైకి మళ్లిన వేళ, చర్చను ముగిస్తున్నట్టు యనమల ప్రకటించగా, వైకాపా సభ్యులు నినాదాలు చేయడంతో వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.