: కేజ్రీకి సమన్లు!... వచ్చే నెల 7న హాజరుకావాలని పాటియాల కోర్టు ఆదేశం


ఆమ్ ఆద్మీ పార్టీకి నిన్న ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టు షాకిచ్చింది. పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మరో ఐదుగురు పార్టీ నేతలకు సమన్లు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం దావా విషయంలో కోర్టు ఈ సమన్లను జారీ చేసింది. కేసు విచారణకు సంబంధించి వచ్చే నెల 7న తమ ముందు హాజరుకావాలని కోర్టు కేజ్రీ సహా ఆయన పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించిన కేజ్రీ... నేరుగా జైట్లీపైనే ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో కేజ్రీ వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందని జైట్లీ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే కోర్టు కేజ్రీకి సమన్లు జారీ చేసింది.

  • Loading...

More Telugu News