: వైసీపీలో చివరికి మిగిలేది జగన్ ఒక్కరే!: జేసీ దివాకర్ రెడ్డి జోస్యం


ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భవితవ్యంపై టీడీపీ సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలైన నేపథ్యంలో జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నిన్న అసెంబ్లీకి వచ్చిన జేసీ... లాబీల్లో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ‘‘వైసీపీలో చివరకు మిగిలేది జగన్ ఒక్కరే. మిగిలినవారంతా టీడీపీలోకి వచ్చేస్తారు. పార్టీ మారుతున్న వారికి చంద్రబాబు కోట్లాది రూపాయలు ఇస్తున్నారన్నది అబద్ధం. ఎన్నికలకు ముందు తన పార్టీలోకి రావాలని జగన్ నన్ను కోరారు. అయితే నేనే వెళ్లలేదు. నా కంటే జగన్ చిన్నవాడు. అతడి వద్దకు నేనెలా వెళతా? జగన్ తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడం ఖాయం’’ అని జేసీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News