: మిర్యాలగూడలో మంద కృష్ణ మాదిగ అరెస్టు... గుంటూరుకు తరలింపు


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ ఎన్ఎస్ పీ క్యాంప్ గెస్ట్ హౌస్ లో ఉన్న ఆయన్ని అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తున్నారు. రేపు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 'ఎమ్మార్పీఎస్ విశ్వరూపయాత్ర' తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా, దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మంద కృష్ణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. అలాగే, తిరుపతి, చంద్రగిరి సహా పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పోలీసులు భారీగా మోహరించారు.

  • Loading...

More Telugu News