: రవిశంకర్ సమ్మేళనానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది
'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహించ తలపెట్టిన 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం'కు ఎట్టకేలకు అనుమతి లభించింది. ఈ నెల 11 నుంచి 13 వరకు యమునా నదీతీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ పెనాల్టీ కింద 5 కోట్ల రూపాయలు చెల్లించాలని ఎన్‌జీటీ ఆదేశించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేయాలని భద్రతాధికారులు సూచించినట్టు తెలుస్తోంది.