: వికీపీడియా నేను చనిపోయినట్టు తప్పుడు సమాచారం ఇస్తోంది: బీజేపీ మహిళా ఎంపీ ఆవేదన


మార్చి 3వ తేదీన తాను చనిపోయినట్లుగా వికీపీడియా తప్పుడు సమాచారం ఇస్తోందని బీజేపీ ఎంపీ అంజుబాల ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఈ విషయమై తన సెక్రటరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే తనకు సిగ్గుగా ఉందని అన్నారు. దీనికి స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక ఎంపీకి సంబంధించి వికీపీడియాలో తప్పుడు సమాచారం అందించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News