: హృదయ, కాలేయ కణజాలాల 3డీ మోడళ్లు


'పర్సన్ ఆన్ ఏ చిప్' అనే టెక్నాలజీని ఉపయోగించి హృదయ, కాలేయ కణజాలాల 3డీ మోడళ్లను టొరంటో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పాడైన అవయవాలను బాగు చేయడానికి లేదా వాటి స్థానే కొత్త వాటిని అమర్చడానికి ఈ మోడళ్లను ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా టొరంటో వర్శిటీ ప్రొఫెసర్ మిలికా రాడిసిక్ మాట్లాడుతూ, అసలైన అవయవాల మాదరిగానే ఇవి పని చేస్తున్నాయని పేర్కొన్నారు. మరిన్ని మానవ కణజాలాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News