: 7,575 మంది పిల్లల్ని రక్షించాం: మనోజ్ఞ సిన్హా
ఇంటి నుంచి పారిపోయిన, తప్పిపోయిన అనేక మంది పిల్లలను రైల్వే ఉద్యోగులు కాపాడారని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా లోక్‌సభకు తెలియజేశారు. దీనికి బాలల సహాయ సంఘాలు సహాయపడ్డాయని వెల్లడించారు. ఇప్పటివరకు రైల్వే స్టేషన్లు, రైళ్లలో తప్పిపోయిన 7,575 మంది పిల్లలను రక్షించినట్లు పేర్కొన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాయంతో రైల్వే శాఖ సంయుక్తంగా మొత్తం 20 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.