: క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్న ఆల్ రౌండర్ వాట్సన్ !
ఆసీస్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ త్వరలో క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వాట్సన్ వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్లు చెప్పాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో భారత్ తో జరిగిన టీ20 సిరీస్ తో ఆస్ట్రేలియా జట్టులోకి వాట్సన్ తిరిగి ప్రవేశించాడు. ఈ సిరీస్ లో అద్భుత ఆటతీరు ప్రదర్శించిన వాట్సన్ టీ20 వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో ఆసీస్ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కాగా, 2007 నుంచి టీ20 కప్ ను సొంతం చేసుకోవాలన్న ఆసీస్ కల నెరవేరట్లేదని, ఈసారైనా తాము గెలిస్తే బాగుంటుందని, క్రికెట్ కు తాను గుడ్ బై చెప్పే సందర్భం మరింత జ్ఞాపకాన్ని మిగులుస్తుందని వాట్సన్ అన్నాడు.