: విజయవాడ కనకదుర్గ గుడి ఈవో వేధిస్తున్నారు: అర్చకుడి కుటుంబం ఆందోళన


విజయవాడ కనకదుర్గ గుడి ఈవో వేధిస్తున్నారంటూ అర్చకుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈవో నర్సింగరావు వేధిస్తున్నారంటూ అర్చకుడు సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరణ ఇచ్చేందుకు ఈవో ఇంటికి వెళ్లిన తనను అటెండర్ తో బయటకు గెంటి వేయించడంతో తన తలకు గాయమైందని సుబ్బారావు ఆరోపించారు. తలకు గాయమవడంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, సదరు ఈవోపై చర్యలు తీసుకోవాలంటూ అర్చకసంఘం డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News