: ఐఫోన్‌, మోటార్‌సైకిల్ కోసం 18 రోజుల కూతుర్ని అమ్మేసిన వైనం


మూడు వారాల‌ వయసు కూడా నిండ‌ని క‌న్నకూతుర్నే అమ్మేసి ఐఫోన్‌, మోటార్‌సైకిల్ కొనుగోలు చేయాల‌నుకున్న ఓ తండ్రి వైనం చైనాలో వెలుగులోకొచ్చింది. 19 సంవ‌త్స‌రాల ఏడ్వాన్ చైనాలోని పాప్యుల‌ర్ మెసేజింగ్ యాప్ క్యూక్యూ ద్వారా త‌న‌ బిడ్డ‌ను బేరానికి పెట్టి, ఈ డీల్ గురించి త‌న‌ భార్య‌కు చెప్ప‌కుండానే అమ్మేశాడు. మెసేజింగ్ ఆప్ ద్వారా బేర‌మాడి చైనాలోని టోంగాన్ సిటీలో త‌న బిడ్డ‌ను ఓ వ్య‌క్తికి 3,500 డాల‌ర్ల‌కు అమ్మేశాడు. అయితే, శిశువు గ‌ర్బంలో ఉండ‌గానే త‌ల్లి పుట్ట‌బోయే త‌న బిడ్డ‌ను విక్ర‌యించ‌డానికి ఒప్పుకుంద‌ట‌. శిశువు జ‌న్మించిన తర్వాత ఐఫోన్ కోసం త‌న భ‌ర్త బిడ్డ‌ను అమ్మేశాడ‌ని తెలుసుకొని బాధ‌ప‌డి సిటీ అంతా గాలించింది. చివ‌రికి పోలీసుల‌కు ఈ విష‌యం తెలియడంతో ఈ విష‌యం వెలుగులోకొచ్చింది. అక్క‌డి చాలా మంది తల్లులు పిల్ల‌ల్ని పోషించే స్థోమ‌త‌ లేక ఇలా బేరాసారాల‌కు దిగుతున్నార‌ని ఆ త‌ల్లి చెప్పింది. ఇలా చేయ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేకం కాద‌ని త‌న‌కు తెలియ‌ద‌ని కూడా చెప్పింది. ఆర్థికప‌ర‌మైన ఇబ్బందులు, పిల్ల‌ల్ని పోషించే స్తోమత లేక అక్క‌డ చాలామంది త‌మ బిడ్డ‌ల్ని అమ్ముకుంటున్నారని అధికారులు తెలిపారు. త‌ల్లితండ్రుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం ఈ జంటలోని భర్తకు మూడేళ్లు, భార్యకు రెండున్నరేళ్ల జైలుశిక్షను న్యాయమూర్తి విధించారు. కొనుగోలు చేసిన వారి ద‌గ్గ‌రే ఇప్పుడు ఆ బిడ్డ పెరుగుతోంది.

  • Loading...

More Telugu News