: తప్పతాగి... విమానం తలుపు తెరవబోయాడు


తప్ప తాగిన ఒక ప్రయాణికుడు విమానం తలుపును తెరవబోయిన సంఘటన మొరాకో-లండన్ విమానంలో జరిగింది. ఏ320 అనే విమానం మొరాకో నుంచి లండన్ కు నిన్న బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత తప్ప తాగిన ప్రయాణికుడు ఒకరు విమానంలో అటుఇటూ తిరగడంతో పాటు ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని విమాన సిబ్బంది పైలట్ కి చెప్పారు. దాంతో పైఅధికారుల అనుమతితో ఆ విమానాన్ని ఫ్రాన్స్ దేశం వైపు పైలట్ మళ్లించాడు. విమానం అక్కడికి చేరుకున్న తర్వాత కూడా సదరు ప్రయాణికుడి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News