: పరీక్షల్లో మ్యాగీ మళ్లీ ఫెయిల్ !


ఆమధ్య వివాదాలను ఎదుర్కొని తిరిగి మార్కెట్లోకి వచ్చినప్పటికీ, మ్యాగీ నూడిల్స్ కి కష్టాలు తప్పట్లేదు. తాజాగా బారాబంకీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో మళ్లీ ఈ ప్రాడక్ట్ విఫలమైంది. మ్యాగీ నూడిల్స్ శాంపిల్స్ ను గత నెల 5వ తేదీన ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ (ఎఫ్ఎస్డీఏ) సేకరించి పరీక్షలకు పంపింది. ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో మ్యాగీ న్యూడిల్స్ ని ఉత్పత్తి చేసే సంస్థ నెస్లేకు ఎఫ్ఎస్డీఏ నోటీసులు జారీ చేసింది. కాగా, మ్యాగీ నూడిల్స్ లో సీసం శాతం అధికంగా ఉందన్న విషయం పరీక్షల్లో తేలడంతో ఆమధ్య చాలా రాష్ట్రాలలో దీని అమ్మకాలను నిషేధించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఎఫ్ఎస్డీఏ మళ్లీ నిర్వహించిన పరీక్షల్లో మ్యాగీ న్యూడిల్స్ కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో మార్కెట్లోకి తిరిగి ప్రవేశించింది. అయితే, ఈ నూడిల్స్ శాంపిల్స్ కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.

  • Loading...

More Telugu News