: రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఆయన విలనే!: అనుపమ్ ఖేర్ పై మండిపడ్డ ఆదిత్యనాథ్


బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా విలనేనని బీజేపీ ఎంపీ ఆదిత్యా నాథ్ వ్యాఖ్యానించారు. గోరఖ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, విలన్ అంటే ఏంటో అందరికీ తెలుసని అన్నారు. కోల్ కతాలో అనుపమ్ చేసిన వ్యాఖ్యలపై ఎక్కువ మాట్లాడదలచుకోలేదని ఆయన చెప్పారు. కాగా, ఈ మధ్య మత అసహనంపై కోల్ కతాలో జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ, బీజేపీ ఎంపీలు యోగి ఆదిత్యానాథ్, సాధ్వి ప్రాచీ అనుచితంగా మాట్లాడుతున్నారని, వారిద్దరినీ పార్టీ నుంచి తొలగించి జైల్లో వేయాలని సూచించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆదిత్యా నాథ్ ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News