: పావలా వాటా ఇవ్వండి...మీరు ఎక్కడడిగితే అక్కడ సంతకం పెడతా: జగన్


మంత్రులు పదే పదే తనపై నిందారోపణలు చేస్తూ...తనపై జరుగుతున్న విచారణ సందర్భంగా 44 వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్ధారించిందని, మంత్రులు చెబుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ శాసనసభలో విమర్శించారు. మంత్రులు తన వద్ద ఉన్నాయని చెబుతున్న 44 వేల కోట్ల రూపాయల్లో పావలా వాటా తనకు ఇస్తే...ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని అన్నారు. విచారణలో జరుగుతున్నది ఒకటి, మంత్రులు ఆరోపిస్తున్నది మరొకటని ఆయన అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు రెండు ఎకరాల ఆసామినని చెప్పుకున్నారని, మరి ఆయన వద్దకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని జగన్ ప్రశ్నించారు. ఆస్తులపై విచారణ జరగకుండా ఆయన ఎందుకు స్టే తెచ్చుకున్నారని ఆయన అడిగారు.

  • Loading...

More Telugu News