: టీ20 వరల్డ్ కప్ కు ట్విట్టర్ కొత్త ఎమోజీలు
టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం ట్విట్టర్ కొత్త ఎమోజీల్ని, ట్రంప్ కార్డులు, స్మైలీలను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ట్రంప్ కార్డుల కోసం ఐసీసీ తమకు సహాయపడిందని చెప్పారు. ఒక్కొక్క ఆటగాడికి ఒక్కొక్క ట్రంప్ కార్డు ఉంటుందని వాటిని పొందిన అభిమానులు ఆ ఆటగాడికి సంబంధించిన తాజా గణాంకాలన్నింటినీ పొందవచ్చని చెప్పారు. టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనే అన్ని జట్ల ఆటగాళ్లకూ ట్రంప్ కార్డులు ఉంటాయని ‘ట్విట్టర్’ ప్రతినిధులు పేర్కొన్నారు.