: రూల్ 329 వాడిన తెలుగుదేశం... చర్చ మధ్యలోనే ముగింపు!
గవర్నర్ ప్రసంగంపై జరగాల్సిన చర్చ అర్థాంతరంగా ముగిసింది. జగన్ ఆరోపణలు, అధికార తెలుగుదేశం ప్రత్యారోపణల మధ్య ఉదయం నుంచి వాడివేడిగా సాగిన చర్చ ప్రమాదకరంగా మారుతోందని, ఇది రాజధానికి భూములిచ్చిన రైతులకు ఉపయుక్తకరం కాదని వెల్లడించిన శాసనసభా పక్ష మంత్రి యనమల రామకృష్ణుడు రూల్ 329ను వాడుకున్నారు. ఈ రూల్ ప్రకారం చర్చను ముగించాలని సూచించారు. ఆపై ముఖ్యమంత్రి సమాధానం ఉంటుందని అన్నారు. ఆ వెంటనే వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి 'రాజధాని భూములపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి' అంటూ నినాదాలు చేశారు. నినాదాలు చేసే సభ్యులు తక్షణం తమ సీట్లలో కూర్చోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని యనమల హెచ్చరించారు. దీంతో సభలో కొంత టెన్షన్ నెలకొంది.