: పార్లమెంట్ ఎదుట హర్యానా వాసి ఆత్మహత్యాయత్నం
భారత పార్లమెంట్ ఎదుట హర్యానాకు చెందిన ఒక వ్యక్తి ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని, విజయ్ చౌక్ లోని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని హర్యానాలోని సిర్సాకి చెందిన హరిసింగ్ గా పోలీసులు గుర్తించారు. అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి గల కారణం విషయానికొస్తే... హరి సోదరి, మరదలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ విషయమై కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోకపోవడంతో అతను మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.