: ఇది చానా అన్యాయమైన విషయం దొరా...: జగన్ వ్యంగ్యం, మైక్ కట్!


అమరావతి భూబాగోతంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేత వైఎస్ జగన్ ప్రసంగానికి అడుగడుక్కీ అధికార పక్ష సభ్యులు అడ్డుపడుతున్నారు. జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్న చంద్రబాబు కాస్తంత పరుషంగా మాట్లాడగా, తిరిగి జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "చంద్రబాబుకు ఇన్ సైడ్ ట్రేడింగ్ కూ, ఇన్ సైడర్ ట్రేడింగ్ కూ తేడా తెలీడం లేదు. ఆయన చేసింది ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఆరోపిస్తున్నాం. అధ్యక్షా... అక్కడ సమస్యేంటంటే, మీ బినామీలందరూ అక్కడ భూములు కొనుగోలు చేసి, సెటిలైన తరువాత, వారి భూములను అక్విజేషన్ లేదా పూలింగ్ నుంచి తప్పించి, వారి పక్కన ఉన్న భూములను పూలింగ్ లేదా అక్విజిషన్ లో తీసుకోవడమన్నది చానా అన్యాయమైన విషయం దొరా" అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆపై మరోసారి ఆయన మైక్ ను కట్ చేసిన స్పీకర్, చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ నిరసన తెలుపగా, "మీకు అవకాశం ఇచ్చినప్పుడల్లా వైడ్ ఎలిగేషన్స్ తో పోతున్నారు. ఇలాగైతే ఎట్లాండీ. ఎవరిమీదైతే ఎలిగేషన్ పెడుతున్నారో వారు మాట్లాడాలి కదా? ప్లీజ్ కూర్చోండి" అన్నారు.

  • Loading...

More Telugu News