: ముద్రగడకు దమ్ముంటే రోడ్డుపై దీక్షకు దిగాలి: 'కాపునాడు' నేత బొబ్బిలి రామారావు
కాపు నేత ముద్రగడ పద్మనాభంకు దమ్ముంటే ఇంట్లో కాకుండా రోడ్డుపై దీక్షకు దిగాలని రాష్ట్ర కాపునాడు పొలిటికల్ యాక్షన్ కమిటీ నేత బొబ్బిలి రామారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తే ముద్రగడకు జైలు తప్పదని ఆయన అన్నారు. కాపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా మరోసారి ఈ నెల 11వ తేదీ నుంచి ముద్రగడ దీక్షకు దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామారావు ఈ వ్యాఖ్యలు చేశారు.