: యశ్వంత్ జీ కాస్తంత సాయం చేయరూ!... కేజ్రీ ప్రతిపాదనతో షాక్ తిన్న బీజేపీ


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా... నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దాదాపుగా తెరమరుగయ్యారు. మోదీ హవాతో బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తరహాలోనే సిన్హా కూడా తెర వెనుకకు వెళ్లక తప్పని పరిస్థితి. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా పలు దఫాలుగా బడ్జెట్ రూపకల్పనలో తనదైన ముద్ర వేసేవారు. వాజ్ పేయి కేబినెట్ లో సిన్హా ఓ వెలుగు వెలిగారు. తదనంతర కాలంలో ఆయన విధానాలు పార్టీకి నచ్చలేదు. అయితే బీజేపీ సర్కారుకు నచ్చని సిన్హా చిట్టా పద్దుల రూపకల్పన ఆమ్ ఆద్మీ పార్టీకి నచ్చినట్లుంది. ఈ నెల 15న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ సర్కారు వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్ రూపకల్పన శరవేగంగా సాగుతోంది. ఈ కసరత్తులో యశ్వంత్ సిన్హా సలహాలు తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భావించారు. ఇంకేముంది, నేరుగా సిన్హాను సంప్రదించిన ఆప్ సర్కారు, చిట్టా పద్దుల్లో సలహాలివ్వాలని కోరింది. దీనిపై ఎలా స్పందించాలో కూడా తెలియక బీజేపీ డైలమాలో పడిపోయింది.

  • Loading...

More Telugu News