: అది కచ్చితంగా తప్పే... షరపోవాపై విరుచుకుపడ్డ మెల్డోనియం తయారీ సంస్థ
గత 10 సంవత్సరాలుగా తాను మెల్డోనియం డ్రగ్ ని తీసుకుంటున్నానని టెన్నిస్ తార మారియా షరపోవా స్వయంగా వెల్లడించడాన్ని ఆ ఔషధాన్ని తయారు చేస్తున్న లాత్వియా సంస్థ గ్రిండెక్స్ తప్పుబట్టింది. మెల్డోనియం వాడాల్సి వస్తే 4 నుంచి 6 వారాల పాటు వాడితే కోర్సు పూర్తవుతుందని, ఎలాంటి రుగ్మతకైనా పదేళ్ల పాటు వాడాల్సిన అవసరం లేదని, ఆమె మెల్డోనియాన్ని ఉత్ప్రేరకంగానే వాడారని ఆరోపించింది. మెల్డోనియంను ఏడాదిలో రెండు కోర్సుల వరకూ తీసుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ ఔషధం ద్వారా శరీరానికి తాత్కాలిక శక్తి వస్తుందని, ఇది ఆటల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు సహకరిస్తుందని చెబుతూ, వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజన్సీ (వాడా) దీనిపై జనవరి 1 నుంచి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ఓపెన్ కు ముందు ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించగా షరపోవా అడ్డంగా దొరికిపోయింది.