: ఓటర్లకు ధన్యవాదాలు!... ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని కేసీఆర్ ప్రకటన
తెలంగాణలో రెండో విడత మునిసిపల్ ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు పాలమూరు జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలోనూ గులాబీ పార్టీ విజయఢంకా మోగించింది. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం తన క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. మూడు చోట్ల తమ పార్టీకి విజయం అందించిన ఓటర్లకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను చూసి ఓటర్లు తమ పార్టీ అభ్యర్థులను దీవించినట్లుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే బాలరాజు... కేసీఆర్ ను కలిసి అభినందనలు తెలిపారు.