: లోటస్ పాండ్ లో 'రిమోట్'... కిర్లంపూడిలో 'ఆపరేట్': అసెంబ్లీలో జగన్ పై తెదేపా


కాపులపై కక్ష కట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్ లోటస్ పాండ్ నుంచి రిమోట్ ద్వారా కిర్లంపూడిలోని ముద్రగడను ఆపరేట్ చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ అసెంబ్లీలో ఆరోపించారు. తక్షణం జగన్ రిమోట్ ను కంట్రోల్ చేయడం ఆపాలని ఆయన అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్, కాపులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని, వారికి రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆపై దాని ఊసే ఎత్తలేదని నిప్పులు చెరిగారు. కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చి, అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే జగన్ ఉద్దేశమని, కాపులకు రూ. 1000 కోట్లను త్వరలో రానున్న బడ్జెట్ లో కేటాయించనున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News