: కాశ్మీర్ మహిళలపై భారత సైనికుల అత్యాచార పర్వం!... మరో వివాదానికి తెర తీసిన కన్నయ్య కుమార్


పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్ గురుకి మద్దతుగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో విద్యార్థులు గత నెల 9 వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పై దేశద్రోహం కింద కేసు నమోదైంది. రోజుల తరబడి జైల్లో గడిపిన అతడు ఇటీవలే విడుదలయ్యాడు. తాజాగా అతడు మరో వివాదానికి తెర తీశాడు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైన్యంపై అతడు ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ మహిళలపై భారత సైనికులు అత్యాచార పరంపర సాగిస్తున్నారని అతడు ఆరోపించాడు. నిన్న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై మరోమారు పెద్ద దుమారమే రేగనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News