: వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లూ టీఆర్ఎస్ వశం... ఉనికి చాటుకున్న విపక్షాలు


నేటి ఉదయం ప్రారంభమైన రెండో విడత మునిసి‘పోల్స్’ ఫలితాల్లోనూ తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ సత్తా చాటింది. పాలమూరు జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీని క్లీన్ స్వీప్ చేసిన ‘గులాబీ’ దళం... గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంది. అయితే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో విపక్షాలు తమ ఉనికి చాటుకున్నాయి. అచ్చంపేటలోని మొత్తం 20 వార్డులను గెలిచిన టీఆర్ఎస్ అక్కడ మహా కూటమిగా ఏర్పడ్డ విపక్షాలకు షాకిచ్చింది. ఇక గ్రేటర్ వరంగల్ విషయానికి వస్తే.. ఇప్పటికే పాలకవర్గ బాధ్యతలను చేజిక్కించుకున్న టీఆర్ఎస్ 29 సీట్లను గెలుచుకుంది. అక్కడ కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించగా, బీజేపీ ఓ స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు చోట్ల గెలిచారు. ఖమ్మం కార్పొరేషన్ విషయానికొస్తే... మొత్తం 50 డివిజన్లలో ఇప్పటికే 30 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అక్కడి పాలకవర్గ బాధ్యతలను చేజిక్కించుకుంది. అక్కడ కాంగ్రెస్ ఆరు డివిజన్లను గెలుచుకుంది. ఇక జగన్ పార్టీ వైసీపీ కూడా ఖమ్మంలో రెండు డివిజన్లను గెలుచుకోగా... సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి.

  • Loading...

More Telugu News