: కైలాస మానస సరోవరంపై మిస్టరీ లైట్లు... వీడియో వైరల్!
కైలాస మానస సరోవరం... హిమాలయాల్లో 19,500 అడుగుల ఎత్తున కొలువైన ప్రాంతం. పరమ శివుడు కొలువై ఉంటాడని భక్తులు నమ్మే ప్రదేశం. మానస సరోవరంలో పుణ్య స్నానాలు చేయాలని, అక్కడి నుంచి కైలాస పర్వతాన్ని కన్నులారా వీక్షించాలని ప్రతియేటా అక్కడికి వందలాది మంది వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రయాణిస్తుంటారు. అలాగే వెళ్లిన చింతా శైలేందర్ అనే భక్తుడు రాత్రిపూట వీడియోను తీస్తుండగా, అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, మూడు దీప కాంతులు కైలాస పర్వతంపై కనిపించాయి. చిమ్మ చీకటిలో ఇవి దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆ కాంతి ఏంటన్న విషయమై స్పష్టత లేకపోయినా, ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్.