: ఖండాలను దాటే అణు బాంబుంది: తొలిసారిగా ప్రకటించిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్


తమకు ఖండాలను దాటి మరీ విధ్వంసం సృష్టించగల సత్తా ఉందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పష్టం చేశారు. మినీ న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయని, వాటిని బాలిస్టిక్ మిసైళ్లకు అమర్చగలమని ఆయన అన్నారు. కొరియా వద్ద అణుబాంబులు ఉన్నాయని అనధికారికంగా ఇప్పటికే స్పష్టంకాగా, స్వయంగా అధ్యక్షుడి నోటి వెంట ఈ మాటలు రావడం మాత్రం ఇదే తొలిసారి. అణ్వస్త్ర బలాన్ని మరింతగా పెంచుకోవాలని కొరియా శాస్త్రవేత్తలకు సూచించిన ఆయన, మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను తయారు చేయాలని వారికి సూచించారు. కాగా, అణ్వాయుధాల తయారీపై ఐరాస ఆంక్షలు విధించిన తరవాత కొరియా మరింత దూకుడుతో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News