: సిండికేట్ బ్యాంకులో రూ. 1000 కోట్ల స్కాం... రంగంలో సీబీఐ!


ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ లో ఐదుగురు ఉన్నతాధికారులు, మరో నలుగురు వ్యక్తులు కలసి రూ. 1000 కోట్ల ప్రజాధనాన్ని కాజేశారని వచ్చిన ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది. బ్యాంకు యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు ఢిల్లీ సహా మూడు నగరాల్లోని నిందితుల ఇళ్లపై దాడులు జరుపుతున్నారు. వీరు దొంగ చెక్కులను నగదుగా మార్చుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఓడీలను మంజారు చేశారని, తప్పుడు కాగితాలు సృష్టించి బిల్స్ పెట్టారని, ప్రీమియంలు చెల్లించకుండా ఉండిపోయిన బీమా పాలసీలను రద్దు చేసి ఆ సొమ్ము కాజేశారని తెలుస్తోంది. బ్యాంకుపై సీబీఐ కేసు వార్త తరువాత స్టాక్ మార్కెట్లో సైతం సంస్థ ఈక్విటీ విలువ భారీగా నష్టపోయింది.

  • Loading...

More Telugu News