: ఆ మాటంటే నా ఉద్యోగం ఊడుతుంది: ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్


తాను గోమాంసంపై మాట్లాడితే, చేస్తున్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందని చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు. ముంబై యూనివర్శిటీ విద్యార్థులతో సమావేశమైన ఆయన, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఓ విద్యార్థి, బీఫ్ బ్యాన్ విధించిన పక్షంలో గ్రామీణ భారతావని ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎలా ఉంటుంది? అని ప్రశ్నించగా, అరవింద్ స్పందిస్తూ, "మీకు తెలుసా, ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తే, నా ఉద్యోగం ఊడిపోతుంది. ఈ ప్రశ్న అడిగినందుకు కృతజ్ఞతలు" అన్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు అతి పెద్ద చర్చా వేదికలని, ఎన్నో అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నాయని అన్నారు. రిజర్వేషన్లు, కుల మతాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ, అధునాతన సాంకేతికత... వంటి ఎన్నో అంశాలపై కొత్త ఆలోచనలు వస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News