: అచ్చంపేటలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్!... మొత్తం 20 వార్డులను గెలిచిన ‘గులాబీ’ దళం
పాలమూరు జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలో గులాబీ జెండా రెపరెపలాడింది. ఇటీవల జరిగిన నగర పంచాయతీ పాలకవర్గం ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో... అన్ని పార్టీలు జట్టుకట్టి మహా కూటమిగా బరిలోకి దిగినా టీఆర్ఎస్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులుంటే, అన్నింటిలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో మహా కూటమిలోని అన్ని పార్టీలకు షాక్ తగిలింది. కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే లెక్కింపు పూర్తి అయ్యింది. మొత్తం అన్ని వార్డులను కైవసం చేసుకున్న టీఆర్ఎస్... నగర పంచాయతీని క్లీన్ స్వీప్ చేసింది. దీంతో అక్కడ గులాబీ దళం సంబరాలు ప్రారంభించింది.